PPM: జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టు సమాచారం తెలిస్తే జరిపించిన తల్లిదండ్రులతో పాటు గ్రామ సర్పంచ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
SKLM: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టిందని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గేదెల చైతన్య అన్నారు. శ్రీకాకుళంలో జనసేన సభ్యత్వ నమోదుకి గురువారం శ్రీకారం చుట్టారు. పార్టీని బలోపేతం చేసి నాయకత్వ బాధ్యతలు యువత చేపట్టాలన్నారు.
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన ప్రదర్శనను గురువారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. ప్రదర్శన ఏర్పాటు పట్ల వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ను అభినందించారు. ఎంతో విజ్ఞానదయంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తిలకించదగినదని చెప్పారు. విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిస్తుందన్నారు.
అనంతపురం: అగ్రిగోల్డ్ బాధితులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం వసూళ్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీకి చెల్లించే పన్నులు ప్రధాన ఆదాయ వనరులు అని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో శుభ్రత, వీధి దీపాలు,తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంటి పన్ను చెల్లించాలన్నారు.
ATP: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 20,855 మంది విద్యార్థులకు గాను 20,517 మంది హాజరుకాగా, 338 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో 1,931 మందికి 1,901 మంది హాజరయ్యారని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పలు స్మశాన వాటికలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ముస్లిం యూత్ సభ్యులు తెలిపారు.
కోనసీమ: ఏపీ శాసన మండలిలో గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని కొత్తపేటకు చెందిన బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం దుయ్యబట్టారు. సీనియర్ సభ్యుడిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. ప్రజలు వైసీపీ పార్టీకి చరమగీతం పాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
ATP: గుంతకల్లు మున్సిపల్ నాన్ పీహెచ్ వర్కర్స్‌తో మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ గురువారం సమావేశం నిర్వహించారు వేసవి కాల దృశ్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోని ఫిల్టర్ బ్లేడ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలో పైప్లైన్ లీకేజీలు, పైప్ లైన్ లలో మురుగునీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
VZM: వాల్టా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యావరణ వేత్త, న్యాయవాది బి. రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎస్.కోటలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సమీపంలో అనుమతులు లేకుండా కొంతమంది జెసిబితో భారీ వృక్షాలు తొలగించారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా వృక్షాలు తొలగింపు విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
ATP: స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ4 కార్యక్రమాలపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లాలో కీలక అభివృద్ధి సూచికల్లో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
KDP: మైదుకూరులోని బద్వేల్ రోడ్డుపై నూతన HPCL పెట్రోల్ బంకును ఎమ్మెల్యే సుధాకర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రవీంద్ర, 7వ వార్డు కౌన్సిలర్ సుమలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ వెంకటయ్య ఫిల్లింగ్ స్టేషన్‌ను రిబ్బన్ కట్ చేసి, టెంకాయ కొట్టి ప్రారంభించారు. నూతన వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
AKP: విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది సూచించారు. గురువారం కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలన్నారు. బజార్లో దొరికే జింక్ ఫుడ్స్ జోలికి వెళ్ళవద్దన్నారు. ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలన్నారు.
KRNL: దేవనకొండ(మం) కప్పట్రాళ్ల స్టేజి సమీపంలో ఇవాళ రెండు కార్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సీఐ వేణుగోపాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASR: రంపచోడవరం మండలం తామరపల్లి సచివాలయంలో రీ-సర్వే అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి, ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం మాట్లాడుతూ.. గ్రామంలో త్వరలో రీ సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తమ భూముల సరిహద్దులు శుభ్రంగా ఉంచి, అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.