• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి’

KKD: పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేడు శాసనసభలో ప్రస్తావించారు.

February 26, 2026 / 01:27 PM IST

రూ.7 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

GNTR: అనారోగ్యంతో బాధపడుతున్న మంగళగిరి బాప్టిస్ట్‌పేటకు చెందిన కట్టెపోగు అనిల్‌కుమార్‌కు మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. గురువారం బాధితుడి నివాసానికి వెళ్లి మంజూరు పత్రాన్ని టీడీపీ నాయకులు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.

February 26, 2026 / 01:27 PM IST

కాపు రామచంద్రారెడ్డికి బీజేపీలో కీలక పదవి

ATP: రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

February 26, 2026 / 01:23 PM IST

తాగునీటి పథకం జడ్పీలో విలీనం చేయవద్దు: ఎమ్మెల్యే

సత్యసాయి: జిల్లా ప్రజల దాహార్తి తీరుస్తున్న సత్యసాయి తాగునీటి పథకాన్ని జిల్లా పరిషత్తులో విలీనం చేయవద్దని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అసెంబ్లీలో కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. విలీనం చేస్తే గ్రామ పంచాయతీలు నిర్వహణ భారమై ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. సత్యసాయిబాబా ఆశయం దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

February 26, 2026 / 01:22 PM IST

వందశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కృషి చేయాలి: DEO

VZM: చీపురుపల్లి పట్టణం బాలుర పాఠశాలను ఇవాళ డిప్యూటీ డీఈవో వెంకటరమణ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన మెనూ వైట్ రైస్, కోడిగుడ్డు కూర, సాంబార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బూసి నాయుడు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:20 PM IST

లవర్‌కి పెళ్లి.. యువకుడి ఆత్మహత్య.!

TPT: చంద్రగిరి RF రోడ్డులో విషాదం నెలకొంది. కడప జిల్లాకు చెందిన సాధిక్ అనే యువకుడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఏసీ మెకానిక్ షాపులో పనిచేస్తున్న సాధిక్, పనికి రాకపోవడంతో యజమాని గదికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

February 26, 2026 / 01:20 PM IST

‘ఈనెల 21వ తేదీ లోపు కుటుంబ సర్వే పూర్తి చేయాలి’

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను ఈనెల 21వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 96,150 కుటుంబాలకు సర్వే నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు.

February 26, 2026 / 01:15 PM IST

మార్కాపురం ఆర్డీవోగా ప్రభాకర్

ప్రకాశం: మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 01:15 PM IST

దుడ్డుకలులో సమ్మర్ క్రాష్ పనులు ప్రారంభం

PPM: దుడ్డుకలు నుంచి బీరుపాడు వరకు  గ్రామస్థులు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంను ఇవాళ MPDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైన్ పరిశీలన, నీటి వనరుల శుద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.

February 26, 2026 / 01:15 PM IST

తెలుగు గంగ కాలువకు గండి

NDL: బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామ శివారులో ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువకు 4-5 బ్లాకుల మధ్య భారీ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇటీవలే సమీపంలో గండి పూడ్చినప్పటికీ మళ్లీ గండి పడటంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

February 26, 2026 / 01:13 PM IST

సూళ్లూరుపేటలో బాలికలకు అవగాహన

TPT: సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ హాజరై ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలు, వాటి నుంచి రక్షణ మార్గాలపై సూచనలు ఇచ్చారు. “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”, వాహన భద్రత, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే శక్తి యాప్‌ గురించి వివరించారు.

February 26, 2026 / 01:12 PM IST

కనిగిరిలో 30% ఐఆర్ కోసం ఏటీపీఎఫ్ నిరసన

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు 30 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్‌కు నేతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

February 26, 2026 / 01:10 PM IST

సుంకం టెండర్ రద్దు చేయాలని ధర్నా

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, చిన్న వ్యాపార సంఘం కార్యదర్శి తిమ్మప్ప మాట్లాడుతూ.. చిన్న వ్యాపారస్తుల కడుపు కొట్టే సుంకం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీని సుంకం గెజిట్ ప్రకారం వసూలు చేయాలన్నారు.

February 26, 2026 / 01:10 PM IST

సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్ జైలు‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని తనిఖీచేసారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు పట్ల ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

February 26, 2026 / 01:10 PM IST

తిరుపతి జిల్లాలో పరీక్షలకు 454 మంది డుమ్మా

తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదని చెప్పారు.

February 26, 2026 / 01:07 PM IST