• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఏఎన్ఎంల విధివిధానాలపై స్పష్టతనివ్వాలి’

W.G: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంల పనితీరు, విధివిధానాలపై అధికారులు స్పష్టతనివ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహనరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం ఎస్పీ స్ట్రీట్ యూపీహెచ్సీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఎన్ఎంలను వారి మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖలోనే విలీనం చేయాలన్నారు.

February 25, 2026 / 06:44 PM IST

పొన్నూరులో సింగిల్ నంబర్ జూదంపై పోలీసుల దాడి

GNTR: పొన్నూరు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో ఆన్‌లైన్ ద్వారా సింగిల్ నంబర్ జూదం నిర్వహిస్తున్న వెంకటరామ సుబ్బారావును గుంటూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి రూ.2,500 నగదు, ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల కోసం నిందితుడిని స్థానిక అర్బన్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

February 25, 2026 / 06:35 PM IST

జిల్లా అభివృద్ధికి కృషి: కలెక్టర్

ASR: జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అందుబాటులో ఉన్న వాటితో, పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నీతి అయోగ్ ప్రోగ్రాంలో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 నిర్వహించారు.

February 25, 2026 / 06:34 PM IST

ఆప్కాస్ కార్మికులతో ఎమ్మెల్యే మాధవి చర్చలు

KDP: తమ డిమాండ్ల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆప్కాస్ కార్మికులతో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్చలు నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 06:34 PM IST

గన్నవరం ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిదే.!

కృష్ణా: రాష్ట్రంలో విద్యార్థుల కోసం సమగ్ర ఇంటర్న్‌షిప్ విధానాన్ని రూపొందించేందుకు యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్ర లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో MLA యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఇంటర్న్‌షిప్‌ల‌పై ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోదని, విద్యార్థులకు సరైన గైడెన్స్‌, మానిటరింగ్‌ తప్పనిసరన్నారు.

February 25, 2026 / 06:30 PM IST

కొలతలలో తేడా వస్తే చర్యలు తప్పవు: ఇన్‌స్పెక్టర్

KRNL: తుగ్గలి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే సమయంలో తూకాలలో, కొలతలలో తేడాలు చేస్తే చర్యలు తప్పవని ఆదోని డివిజన్ తునికి, కొలతల ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం దస్తగిరికు చెందిన ఎస్ఎస్ ట్రేడర్ షాప్లో ఆయన తూకాలు వేసే ఎలక్ట్రికల్ కాటా మిషన్లను తనిఖీ చేశారు.

February 25, 2026 / 06:25 PM IST

పల్లా క్రికెట్ టీంలో ఎమ్మెల్యే

PPM: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కబడ్డీ, టేక్ ఆఫ్ వారు వంటి ఆటలు పూర్తికాగా బుధవారం క్రికెట్ పోటీలు సందడిగా సాగాయి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కెప్టెన్‌గా వ్యవహరించిన టీంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రికెట్లో సత్తా చాటారు.

February 25, 2026 / 06:22 PM IST

ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

W.G: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈనెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలో 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.3 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలన్నారు.

February 25, 2026 / 06:19 PM IST

ముగిసిన వక్త పోటీలు

VZM: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ముఖ్య లక్ష్యంగా వక్త పోటీలను నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, మిరియాల కృష్ణారావు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వక్త పోటీలను బుధవారం గురజాడ పాఠశాలలో నిర్వహించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతి అందజేశారు.

February 25, 2026 / 06:17 PM IST

26 నుంచి విశాఖలో గవర్నర్ పర్యటన

VSP: ఒడిశా గవర్నర్ హరిబాబు 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఫిబ్రవరి 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్లో పుస్తకావిష్కరణ, అనంతరం నోవోటెల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. 27న బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సంలో పాల్గొననున్నారు.

February 25, 2026 / 06:16 PM IST

ఆర్టీసీ కానిస్టేబుల్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

PLD: నాదెండ్ల(M) ఇర్లపాడుకు చెందిన మంజుభార్గవి ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఆర్టీసీ కానిస్టేబుల్ మేకల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సుబ్బనాయుడు పర్యవేక్షణలో నాదెండ్ల ఎస్ఐ ఈ కేసు దర్యాప్తు చేశారు. సోమవారం అదుపులోకి తీసుకున్న నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో బుధవారం పోలీసులు జైలుకు తరలించారు.

February 25, 2026 / 06:15 PM IST

పునర్విక చికిత్సకు రూ.50 లక్షలు: MP

NDL: వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక చికిత్స కోసం కేంద్ర ఆరోగ్యశాఖ రూ.50 లక్షల సాయం చేసిందని MP శబరి ఇవాళ తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సమస్యను తండ్రి తనదృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా NPRD పథకం నుంచి నిధులు విడుదలయ్యాయని అన్నారు. సహకరించిన కేంద్ర మంత్రి JP నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2026 / 06:14 PM IST

మంత్రితో దెందులూరు ఎమ్మెల్యే భేటీ

ELR: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజయవాడలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు రైతాంగ, కోకో పంటల రైతుల అంశాలపై మంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ గుత్తా అనిల్ పాల్గొన్నారు.

February 25, 2026 / 06:13 PM IST

కంచికచర్ల మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: నందిగామలోని కంచికచర్ల మార్కెట్ యార్డ్‌లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు బుధవారం ప్రారంభించారు. వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో రైతులు అధికంగా శనగలు సాగు చేసినందున నష్టపోకుండా ఉండేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఉద్దేశం రైతులకు మద్దతుగా నిలబడమే అని ఆయన అన్నారు.

February 25, 2026 / 06:12 PM IST

పట్రపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ.1.5 లక్షల నష్టం

అన్నమయ్య: పుంగనూరు(మం) పట్రపల్లిలో నెల్లి, అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రిప్ పైపులు, కేబులు దగ్ధమవగా సుమారు రూ.1.5 లక్షల నష్టం జరిగినట్లు పోలీసుల అంచనా. ధూమపానం ముక్కల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తోటకు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో అప్రమత్తం చేశారు.

February 25, 2026 / 06:10 PM IST