• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

W.G: నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రామరాజు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 04:48 PM IST

‘జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’

SKLM: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ అన్నారు . శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నరసన్నపేటలో ఏప్రిల్ 4, 5 తేదీలలో జరిగే మహాసభలకు కార్మికులు, రైతులు తరలిరావాలని కోరారు. జిల్లాలో భూమి,నిర్వాసితుల సమస్యలు, ఉపాధి హామీ అమలు వంటి అంశాలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

February 27, 2026 / 04:45 PM IST

‘వినతులు తక్షణమే పరిష్కరించాలి’

PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. అయిదు ప్రధాన వినతులు అధికారుల దృష్టిలోకి వచ్చాయన్నారు. ఈ సందర్బంగా పిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 04:45 PM IST

‘పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి’

 KDP: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు ముద్దునూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న రికార్డులను సక్రమంగా ఉన్నాయా లేదా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై సంబంధిత సీఐ నగేష్ బాబు‌తో సమీక్ష నిర్వహించారు.

February 27, 2026 / 04:45 PM IST

ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రత

ELR: జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రతను కూడా కల్పిస్తుందని, కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన మాట్లాడారు.కేవలం 100 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ గత ఎన్నికల నాటికి 6 లక్షల సభ్యత్వాన్ని సాధించిందన్నారు.

February 27, 2026 / 04:41 PM IST

పిడుగురాళ్లలో ఉపాధ్యాయుల ధర్నా

PLD: పిడుగురాళ్లలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30% మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, పెండింగ్ డీఏలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

February 27, 2026 / 04:41 PM IST

రేపు లక్ష్మీకాసుల హారంతో శ్రీవారి గరుడ సేవ

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వేంకటరమణ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గరుడసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. గరుడ వాహనసేవలో పట్టణంలోని తూర్పు మొగశాల వద్ద గల శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వెండి కాసుల హారం ఆలయం నుంచి సాయంకాలం మూడు గంటలకు శోభాయాత్రగా పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 04:38 PM IST

రాజంపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

అన్నమయ్య: రాజంపేట ఎన్టీఆర్ వైద్యసేవ వర్తించని వ్యాధులతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో రూ.34,05,462 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.

February 27, 2026 / 04:36 PM IST

సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం

అన్నమయ్య: గాలివీడులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలోని కదిరి రోడ్డులో గుడికి వెళ్లే దారి నుంచి చిన్నేటిగడ్డలోని శ్రీ గాలివీటమ్మ తల్లి ఆలయం వరకు, అక్కడి నుంచి వెలుగు కార్యాలయం వరకు సుమారు రూ. 4,500,000 వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

February 27, 2026 / 04:35 PM IST

కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో గ్లోరియా

బాపట్ల: ఆర్డీవో గ్లోరియా రేపల్లె ఆర్డీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినందుకు ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తానన్నారు.

February 27, 2026 / 04:34 PM IST

ఉపాధి హామీ పథకం మార్పుపై అవగాహన సదస్సులు

NDL: ఆత్మకూరు మండలంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఇవాళ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగేంద్రుడు, ఏపిఓ నాగార్జున (ఐటిడిఏ) తెలిపారు. కొత్త చట్టం ప్రకారం వేతనాలు సకాలంలో చెల్లింపులు, పనిదినాలు 100 నుండి 125కు పెంపు వంటి అంశాలను ప్రజలకు వివరించనున్నారు.

February 27, 2026 / 04:34 PM IST

డీసీసీబీ కాలనీలో పర్యటించిన కలెక్టర్

SKLM: నగరంలోని డీసీసీబీ కాలనీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం పర్యటించారు. కాలనీలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య పనుల నాణ్యతను తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 27, 2026 / 04:32 PM IST

రేపు జరుగుమల్లికి మంత్రి రాక..!

ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామంలో రేపు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమానికి కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి రానున్నారని జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్థులు పాల్గొనాలని తెలిపారు.

February 27, 2026 / 04:32 PM IST

310 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

February 27, 2026 / 04:30 PM IST

ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రేపటి షెడ్యూల్

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఉదయం 8 గంటలకు భోగాపురం మండలం, గుడివాడ పంచాయతీ వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు ముంజేరు సచివాలయాలకు ట్రైసైకిల్స్ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు.

February 27, 2026 / 04:30 PM IST