PLD: దేవరంపాడులోని శ్రీ మత్స్యావతార నేతి వెంకన్న స్వామి ఆలయంలో రెండో శనివారం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేడుకల అనంతరం ఆలయ కమిషనర్ డి. చంద్రశేఖర్ పర్యవేక్షణలో అధికారులు హుండీ కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపులో హుండీ ద్వారా రూ. 6,08,489, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 4,22,220 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
KDP: ఒంటిమిట్ట బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కేర్ ఆస్పత్రిలో ఆదివారం శ్రీనివాస వైద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ గౌరీ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి బుక్కా వీధిలో మైలిపిల్లి సాగర్, అతని కుటుంబ సభ్యులపై ఓ గొడవ నేపథ్యంలో యజ్ఞ నీలవేణి, ఆమె కుమారులు శనివారం రాత్రి కర్రలతో దాడి చేశారు. దీంతో సాగర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కేజీహెచ్‌లో చేర్పించగా సాగర్ సోదరుడు కోమాలోకి చేరాడు. ఘటనపై సీఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: పెళ్లకూరు మండలంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 14,34,400 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట రూరల్ సీఐ తెలిపారు. అలాగే పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
GNTR: తెనాలిలో శనివారం రాత్రి జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరైనా సహజ మరణం పొందితే వారి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో పవన్ కళ్యాణ్ తరపున రూ. 50 వేలు, స్థానిక నాయకత్వం ద్వారా మరో రూ. 50వేలు అందజేస్తామని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
PLD: నరసరావుపేటలో ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ. 240 నుంచి రూ. 260 వరకు, స్కిన్‌తో ఉన్న చికెన్ ధర రూ. 220 నుంచి రూ. 240 వరకు ఉంది. ఇక లైవ్ కోడి రూ. 140కి, పెద్ద బాయిలర్ రూ. 260 నుంచి రూ. 280కి లభిస్తున్నాయి. అలాగే మటన్ ధర రూ. 850 నుంచి రూ. 1000 వరకు ఉండగా, 100 కోడిగుడ్ల ధర రూ. 500గా ఉంది. ప్రాంతాలను బట్టి […]
SKLM: జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.170, విత్ స్కిన్ రూ.220, స్కిన్ లెస్ రూ.260గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నా యని విక్రయదారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం వినియోగదారులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి.
KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో మనేకుర్తిలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి సమస్యలు నేరుగా తెలిపారు. కొన్నింటిని అక్కడే పరిష్కరించారు, మిగతా సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని, సమస్యలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.
విశాఖలో మాంసం దుకాణాల వద్ద ఆదివారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో ఈ రోజు కేజీ మటన్ రూ.1000లకు విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్ లెస్ రూ.300, విత్ స్కిన్ రూ.280, చికెన్ లైవ్ రూ.185, సొంట్యాం రూ.320, గుడ్లు డజను రూ.70లుగా ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతకు అమ్ముతున్నారో కామెంట్ చేయండి.
TPT: ప్రభుత్వం జారీ చేసిన జీ.వో.ఆర్.టీ.నం.494 ప్రకారం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. అయితే సాయి ప్రసాద్‌కు వాటర్ రిసోర్సెస్, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూరి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముద్దాడ రవిచంద్ర టీటీడీ పూర్తి బాధ్యతలను స్వీకరించారు.
ATP: రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (ఏపీబీఓసీడబ్ల్యుడబ్ల్యుబీ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నాలుగు రకాల పథకాలకు అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య శనివారం ఓ ప్రక టన విడుదల చేశారు. ఈనెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
KRNL: బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి మంత్రి బీసీ జనార్దన్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగ-ఉపాధి వంటి సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.
SKLM: నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శరత్‌ను విధుల నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంఛార్జ్ ఈఈ కమలాకర్‌తో పాటు మరికొందరికి షోకాజ్ నోటీలుసు జారీ చేశారు.
NLR: కొంతకాలంగా పేకాట ఆడుతున్న 15 మందిని కావలి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో కొందరు కొంతకాలంగా పేకాట స్థావరం ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. వారి వద్ద నుంచి 1.50 లక్షలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సుమారు 60 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడి వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.