KDP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతికి బాధ్యత వహిస్తూ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజీనామా చేయాలని AITUC డిమాండ్ చేసింది.బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కడప AITUC నాయకుడు కేసీ బాదుల్లా కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు.
కర్నూలు: కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని ఆమె ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
AKP: శత శాతం ఇంటి పన్నుల వసూళ్లకు డ్వాక్రా మహిళలు సహకరించాలని ఎస్.రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వమ్మవరంలో డ్వాక్రా మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటి పన్నులు ఇంతవరకు చెల్లించని వారు వెంటనే చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
NLR: విడవలూరు మండలంలోని దంపూరు రైతు సేవ కేంద్రం పరిధిలో పోస్ట్ బడ్జెట్ webinar కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైవ్ టెలికాస్ట్‌ను రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖల యొక్క అభివృద్ధి, పురోగతిపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ATP: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఖనిజ సంపద ఉన్న ఇరాన్ దేశంపై దాడి చేయడం చాలా దారుణం అన్నారు.
సత్యసాయి: ధర్మవరంలో ‘ఆర్డీటీని రక్షించుకుందాం’ అనే నినాదంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా అనంత ప్రజల జీవనాడిగా మారి పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ప్రతికూల చర్యలు ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సంస్థ ప్రతి గడపకూ చేరువైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.
కర్నూలు: మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ స్కావెంజర్లు, నైట్ వాచ్‌మెన్‌లకు వేతనాలు పెంచి, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందించారు.
ప్రకాశం: కంభంలో ఇంటి పన్ను వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. మార్చి 15 నాటికి ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందాలతో సమీక్ష నిర్వహించి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
W.G: ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకమని ప్రిన్సిపల్ టి.అశోక్ అన్నారు. ఫార్మసీ పితామహుడు మహాదేవ్ లాల్ ప్రాఫ్ జయంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఫార్మసీ విద్యార్థులు నైతిక విలువలు, సేవ భావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు.
PLD: మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాచర్ల అర్బన్ సీఐ వెంకటరమణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో విధులు ఏ విధంగా ఉంటాయని, ఎవరు ఎలా విధులు నిర్వహిస్తారని విద్యార్థులకు వివరించారు.
కడప: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డా.హరి కొండయ్య తెలిపారు. సిద్దవటం ZP ఉన్నత పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మార్చి 12 వరకు జరుగు నిరసనలో భాగంగా ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరయ్యారు.
SKLM: కొత్తూరు మండలంలోని పాతపాడు-నివగాం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి శంకుస్థాపన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు డాక్టర్ సాయి గణేష్ హాజరై రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. Aరూ.1.50 కోట్ల నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకి సూచించారు.
PPM: ఈనెల 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి తెలిపారు. వారోత్సవాలలో భాగంగా మల్టీ ఫంక్షన్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై, ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు.
ASR: హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జోగులపుట్టు గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన 41 కొత్త పాసు పుస్తకాలను ఆర్డీవో లోకేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు.
అన్నమయ్య: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల, వంశీకృష్ణ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారంతో సీఐలు శివన్న, శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి గురువారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 5 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు.