• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఈవో పర్యవేక్షణలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

VZM: చీపురుపల్లి గ్రామ పంచాయతీ EO ఝన్సీరాణి పర్యవేక్షణలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహించారు. ఈ మేరకు డైలీ మార్కెట్‌, లెక్చలర్స్‌ వీధులతో పాటు సచివాలయం-5, రాజాంరోడ్డు, కనకమహాలక్ష్మి ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులు కాలువ పూడికలు తీశారు. అనంతరం చెత్త కుప్పలను డంపింగ్‌ యార్డ్‌కు తరలించారు. ఈ పనులను JA రాము పరిశీలించారు.

March 1, 2026 / 12:28 PM IST

రాజీనామాలు వెనక్కి తీసుకున్న టీడీపీ నాయకులు

KRNL: ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ వ్యవహారంపై రాజీనామాలు చేసిన వల్లూరి నాగేశ్వరరావు, వల్లూరి పట్టాభి తమ రాజీనామాలను ఇవాళ వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడలో నారా లోకేష్ తదితరులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతరులు కూడా రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 1, 2026 / 12:28 PM IST

క్రీడలు క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు: ఎమ్మెల్యే

VZM: క్రీడలు క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. భోగాపురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ యూత్ వాలీబాల్ (పురుషుల & మహిళల) జట్టు ఎంపికలను ఆదివారం ఆమె ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కాసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు.

March 1, 2026 / 12:24 PM IST

లైబ్రరీలో చిన్నపిల్లల పుస్తక ప్రదర్శన

AKP: నర్సీపట్నం శాఖా గ్రంధాలయంలో ఆదివారం చిల్డ్రన్ బుక్స్ ఎగ్జిబిషన్ లైబ్రేరియన్ దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల కథలు, పిల్లల సాహిత్యాలు, దేశ నాయకులు చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు,ఇంగ్లీష్ కదల పుస్తకాలు మొదలైనవి ప్రదర్శించారు. పిల్లలందరూ పుస్తకాలను తిలకించి, వారికి నచ్చిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకున్నారు.

March 1, 2026 / 12:21 PM IST

మాల్యాద్రి స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.9,76,224 లక్షల ఆదాయం వచ్చినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రూ.2,45,900, లడ్డూ ప్రసాదానికి రూ.2,16,105, అన్న ప్రసాదానికి రూ.3,98,528, తలనీలాలకు రూ.31,725, వివిధ పూజలకు సంబంధించి రూ.62,506, రూమ్ అద్దెల ద్వారా రూ.21,440 సమకూరిందని వివరించారు.

March 1, 2026 / 12:20 PM IST

ఏపీ జేఏసీ జాయింట్ సెక్రటరీగా జగ్గారావు

E.G: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరుఫున ఏపీ జేఏసీ జాయింట్ సెక్రటరీగా రాజమండ్రికి చెందిన దడాల జగ్గారావు నియమితులయ్యారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో సంఘ అధ్యక్షుడు మీసాల మాధవరావు ఈ నియామకాన్ని ప్రకటించారు. జగ్గారావు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

March 1, 2026 / 12:20 PM IST

ఈనెల 2 నుంచి యాదుల్లాహ్ భాష ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష ఖాద్రి రహిమతుల్లా అలైహి 175వ ఉరుసు ఉత్సవాల వాల్ పోస్టర్లను గుత్తి, పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆవిష్కరించారు. ఉరుసు నిర్వాహకులు ఇసాక్ మాట్లాడుతూ.. ఈనెల 2, 3, 4 తేదీలలో స్వామివారి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 12:19 PM IST

బండి ఆత్మకూరులో 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం

NDL: బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఆదివారం ఎస్సై జగన్మోహన్ పోలీస్ సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో బెల్ట్ షాపు నడిపేవారు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 1, 2026 / 12:19 PM IST

మాంసం ధరల వివరాలు..!

అన్నమయ్య: రాయచోటిలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ కేజీ రూ. 230, స్కిన్‌లెస్ చికెన్ రూ. 260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను రూ. 450, రాగండి రూ. 200, బొచ్చెలు రూ. 230గా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా చికెన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.

March 1, 2026 / 12:14 PM IST

వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు..!

NDL: కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నిమ్మకాయల రంగయ్య తన అనుచరులతో కలిసి ఇవాళ బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.

March 1, 2026 / 12:13 PM IST

విశాఖలో PGRS ఫిర్యాదులపై ప్రశ్నలు

విశాఖపట్నంలో ప్రతి సోమవారం కలెక్టరేట్, జీవీఎంసీ మెయిన్ కార్యాలయం, జోన్ కార్యాలయాల్లో PGRS నిర్వహిస్తున్నారు. అయినా ఫిర్యాదులు ఎక్కువగా జోన్ కార్యాలయాలకంటే జీవీఎంసీ మెయిన్ ఆఫీస్, కలెక్టరేట్‌కే చేరుతున్నాయి. జోనల్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదా? లేక వాటి వివరాలు ప్రజలకు తెలియవా? అనే అంశంపై చర్చ జరుగుతుంది.

March 1, 2026 / 12:07 PM IST

‘రహదారుల నిర్మాణం కొరకు నిధులు మంజూరు’

VZM: విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చొరవతో ఆదివారం మండలం పరిధిలో గల 7 రహదారుల నిర్మాణం (15.068 కి.మీ.) కొరకు రూ.7.67 కోట్లు నిధులు మంజూరు అయినట్లు మండల పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజల తరపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

March 1, 2026 / 12:07 PM IST

చికెన్ ధరల వివరాలు..!

కడప: జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా చికెన్ ధరలు పెరిగాయి. గత వారం రూ. 220గా ఉన్న కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ. 250కు చేరింది. స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్ అధికమవడంతో దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపిస్తోంది. రంజాన్ కాలంలో వినియోగం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.

March 1, 2026 / 12:03 PM IST

రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన

ప్రకాశం: కంభంలో SI శివకృష్ణారెడ్డి శనివారం రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 1, 2026 / 11:59 AM IST

జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక..!

KRNL: ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు.

March 1, 2026 / 11:59 AM IST