• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘తహశీల్దార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు’

NTR: ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌పై  రైతులు, కూటమి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తహశీల్దార్ కార్యాలయం ముందు PACS ఛైర్మన్ గరికపాటి శ్రీనివాసరావు, మూలపాడు రైతులు నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్, వీఆర్డీ నరేంద్ర పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 6, 2026 / 09:45 AM IST

కేంద్రమంత్రికి రైతు సంఘాల విన్నపం

GNTR: మొక్కజొన్న క్వింటాకు రూ. 2400 మద్దతు ధర కల్పించాలని కోరుతూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు రైతు సంఘం నాయకులు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ. 1600 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

March 6, 2026 / 09:45 AM IST

కర్నూలు నగర కూడళ్లలో హరిత పందిర్లు: కమిషనర్

KRNL: వేసవిలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కర్నూలులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పాయింట్ల వద్ద హరిత పందిర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులకు శుక్రవారం సూచించారు. చెకోపోస్ట్ నుంచి చౌరస్తా ఉన్న అన్ని కూడళ్లలో, కేఎంసీ తాత్కాలిక కార్యాలయం వద్ద పార్కింగ్ పందిర్ల ఏర్పాటుకు టెండర్ పిలవాలని ఆదేశించారు.

March 6, 2026 / 09:44 AM IST

అక్రమ బాణసంచా స్వాధీనం

W.G. ఇరగవరం మండలం తూర్పు విప్పర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను ఎస్సై జానా సతీష్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన మామిడిశెట్టి శ్రీను తూర్పువిప్పర్రులో గోనెసంచుల ఫ్యాక్టరీలో బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. సుమారు రూ.30,000 విలువ చేసే బాణా సంచాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

March 6, 2026 / 09:42 AM IST

జిల్లాలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో డయేరియా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. ఇవాళ ఉదయం 5.30 గంటల నుంచే పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్, ఇన్‌‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహమ్మద్ ఖాన్ పనులను పర్య వేక్షిస్తున్నారు. 50 డివిజన్ల పరిధిలో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రిప్పర్లు అందుబాటులో ఉంచి చెత్తను డంపింగ్ యార్డ్‌కి తరలిస్తున్నారు.

March 6, 2026 / 09:38 AM IST

బొబ్బిలిలో నాకాబందీ.. వాహనాల తనిఖీ

VZM: బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 6, 2026 / 09:34 AM IST

వైభవంగా ఆలయం పునః ప్రారంభం

AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని గురువారం వైభవంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమాలు, కలశ పూజలు చేశారు. ఇదే ప్రాంగణంలో మరిడిమాంబ ఆలయాన్ని కూడా ప్రారంభించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పలువురు అమ్మవారులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వినోద్ రాజు పాల్గొన్నారు.

March 6, 2026 / 09:32 AM IST

ప్రొద్దుటూరు పట్టణ ఐద్వా కార్యవర్గం ఎన్నిక..!

KDP: పొద్దుటూరు పట్టణ ఐద్వా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయకుమారి, ఉపాధ్యక్షులుగా సర్వేశ్వరీ, రాములమ్మ, వెంకటసుబ్బమ్మ, భానుమతి, ప్రధాన కార్యదర్శిగా గోకుల ప్రేమ, సహాయ కార్యదర్శులుగా లావణ్య, ఝాన్సీ, గుర్రమ్మ, జ్యోతి, సుదర్శనమ్మ, లక్ష్మీదేవి, పుష్పలత, కోశాధికారిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 6, 2026 / 09:32 AM IST

భానుడి ప్రతాపంలో కావలి టాప్

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్య ధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

March 6, 2026 / 09:31 AM IST

రేపు భీమడోలుకు రానున్న షర్మిళ

ELR: ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనెల 7న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి భీమడోలులో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని కూలీలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహనరావు పార్టీ నేతలతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.

March 6, 2026 / 09:28 AM IST

నేడు పత్తికొండలో జాబ్ మేళా..!

KRNL: పత్తికొండలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనునారు. ఈ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివి 18-40 ఏళ్ల మధ్య వారు అర్హులు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.

March 6, 2026 / 09:28 AM IST

5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

VSP: రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్ధులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో ఇవాళ ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు.

March 6, 2026 / 09:26 AM IST

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: గుడివాడ మండలం బేతవోలు హై స్కూల్ విద్యార్థులకు మహిళల భద్రతపై వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 6, 2026 / 09:20 AM IST

జనగణన డేటా సేకరణలో జాగ్రత్తలు పాటించాలి: జేసీ

ATP: జన గణన డేటా సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేయాలని, అనంతపురం జనాభా గణన 2027 ప్రక్రియను 100% పూర్తిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు.

March 6, 2026 / 09:20 AM IST

బోయకొండకు వెళ్తున్నారా.. గుడ్ న్యూస్!

CTR: బోయకొండ గంగమ్మ ఆలయ టోల్ గేట్ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తగ్గిస్తున్నట్టు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. బస్సు, లారీలకు రూ. 200 నుంచి 150, కారుకు రూ.150 నుంచి 100, ఆటోకు రూ.70 నుంచి 50 తగ్గించి తీసుకుంటామని చెప్పారు. బైకులకు ఎటువంటి ఫీజు లేదన్నారు.

March 6, 2026 / 09:19 AM IST