• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ నెల 26న నెల్లూరుకు రానున్న జగన్

NLR: ఈ నెల 26వ తేదీన నెల్లూరులోని VPR కన్వెన్షన్ లో జరగనున్న ఒక వివాహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, హెలిపాడ్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు శాఖకు లేఖ రాశారు. దీనికి స్పందించి, కనుపర్తిపాడులోని జడ్పీ హైస్కూల్లో హెలిపాడ్కు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

February 24, 2026 / 09:22 AM IST

రేపు బాలాయపల్లిలో ప్రత్యేక విద్యుత్ అదాలత్

TPT: ఈ నెల 25న స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించబడనుంది. జైర్లన్, రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, మరో ముగ్గురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్థానికుల డిస్కం సమస్యలను పరిష్కరిస్తారు. బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాల వినియోగదారులు ఈ అదాలత్‌లో తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అధికారులు సూచించారు.

February 24, 2026 / 09:20 AM IST

వేగ నియంత్రణ కోసం స్టాపర్లు ఏర్పాటు: SI

VZM: వేగ నియంత్రణ కోసం స్టాపర్లు ఏర్పాటు చేసామని డెంకాడ SI సన్యాసి నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక PS పరిధిలో NHపై 10 చోట్ల ఏర్పాటు చేసిన స్టాపర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనాల వేగం తగ్గించేందుకు జింగ్‌ జాగ్‌ స్టాపర్లు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 09:20 AM IST

విధుల పట్ల నిర్లక్ష్యం.. ఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ

W.G: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో మొగల్తూరు ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ నయీం అస్మి ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీలు చేపట్టినట్లు సమాచారం. ఎస్సై వై.నాగలక్ష్మిని డీసీఆర్బీకి, కానిస్టేబుల్ రాంబాబు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు, కానిస్టేబుల్ రాజేశ్‌ను ఆకివీడు స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 09:20 AM IST

ఈ నెల 26న భారీ జాబ్ మేళా

NDL: APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 26న ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DSDO శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 1,250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని ఆయన సూచించారు.

February 24, 2026 / 09:19 AM IST

ఈనెల 27న కసాపురం హుండీ లెక్కింపు

ATP: గుంతకల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27న స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రారంభమయ్యే హుండీ లెక్కింపు కార్యక్రమానికి ఆలయ సిబ్బంది విధిగా హాజరుకావాలని సూచించారు.

February 24, 2026 / 09:19 AM IST

‘APOSS పబ్లిక్ పరీక్షకు 4 కేంద్రాలు ఏర్పాటు’

ఏలూరు జిల్లాలో APOSS వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ మార్చి 2 నుంచి 13 వరకు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

February 24, 2026 / 09:14 AM IST

రైతులను తిప్పలు పెడుతున్న పర్ఫాల్ స్వాపెన్ పక్షులు

NDL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని ఈ పక్షులు జీవిస్తాయి.

February 24, 2026 / 09:10 AM IST

‘అక్రమ ప్లాట్లు, గుడిసెలను తొలగించాలి’

KRNL: చిలకలడోన గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ ప్లాట్లు, గుడిసెలను తొలగించాలని ఎస్సీ కాలనీవాసులు జిల్లా సబ్ కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనపరచి, స్థలంలేని నిరుపేద కుటుంబాలకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 09:10 AM IST

పీజీఆర్ఎస్ కు 127 అర్జీలు

SKLM: అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. 127 అర్జీలు ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ , గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

February 24, 2026 / 09:06 AM IST

రైల్వే స్టేషన్ వద్ద వృద్ధుడి మృతి

నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు CI నంబర్ 91211 01088కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 24, 2026 / 09:05 AM IST

శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి

TPT: ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తికి విచ్చేశారు. దర్శనం అనంతరం ధూర్జటి కళా ప్రాంగణంలో విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతిసారి స్వామి వారిని దర్శించుకోవడం నా భాగ్యమని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు మెరుగ్గా అందుబాటులో ఉన్నాయని ప్రశంసించారు.

February 24, 2026 / 09:04 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’

KDP: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తు వదిలించేలా స్వయంగా నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు.

February 24, 2026 / 09:04 AM IST

రీ-ఓపెన్ అర్జీలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

NDL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీ-ఓపెన్ అయ్యామన్నారు.

February 24, 2026 / 09:04 AM IST

నరసాపురం డిపోలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన

W.G: ఆర్టీసీలోని 12 డిపోలను పినాకిల్ సంస్థకు అప్పగించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ నరసాపురం డిపో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. NMUA పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 09:02 AM IST