• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

KDP: వల్లూరు మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో 6వతరగతి ప్రవేశానికి దరఖాస్తులను నేటి నుంచి మార్చి 31 వరకు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సురేశ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12న ఉదయం 10 గంటలకు ఆదర్శపాఠశాలలో పరీక్ష జరుగుతుందన్నారు. ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీలు రూ.100 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

February 24, 2026 / 11:12 AM IST

ACB కి చిక్కిన ఫారెస్ట్ అధికారి

W.G: భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు.

February 24, 2026 / 11:10 AM IST

నేటి మధ్యాహ్నం నుంచి ఆటల పోటీలు

అనకాపల్లి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటలు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు స్పీకర్ల అయ్యన్నపాత్రుడు శాసనసభలో తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో 3 రోజులు పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బహుమతి ప్రధానోత్సవానికి కుటుంబ సభ్యులతో హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 10:56 AM IST

టీడీపీకి షాక్.. నాగేశ్వరరావు, పట్టాభిలు రాజీనామా..!

KRNL: కౌతాళంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఇవాళ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పట్టాభిలు టీడీపీ, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 44 ఏళ్లుగా తమ కుటుంబం పార్టీకి సేవలు అందించినప్పటికీ, ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఎంపిక విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.

February 24, 2026 / 10:53 AM IST

గురుకుల ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

ATP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ పోస్టర్లను విడుదల చేశారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశం కోరే విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 10:50 AM IST

దేవరపల్లిలో మందుబాబుల అడ్డాగా ‘సంపద కేంద్రం’

E.G: దేవరపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారాయని వాపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

February 24, 2026 / 10:45 AM IST

కాకుమాను నూతన ఎస్సైగా హరికృష్ణ

GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి. హరికృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.

February 24, 2026 / 10:44 AM IST

గల్లంతైన మరో యువకుడి మృతదేహం లభ్యం

BPT: బాపట్ల మండలం అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో గత సోమవారం గల్లంతైన ఇద్దరు యువకులలో చందు అనే యువకుడి మృతదేహం మంగళవారం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే, మరో యువకుడు పీటా వంశీ లభ్యం,ఇప్పటికే లభ్యంమైనట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

February 24, 2026 / 10:42 AM IST

జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

SKLM: ఉండవల్లిలో రాష్ట్ర మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి హాజరయ్యారు. ఈ మేరకు మంత్రి ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి,యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు రవికుమార్, శిరీష, రమణ మూర్తి పాల్గొన్నారు.

February 24, 2026 / 10:36 AM IST

బహిరంగ సభను విజయవంతం చేయండి: ఉషశ్రీ చరణ్

SS: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 1న కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.

February 24, 2026 / 10:33 AM IST

కార్వేటినగరం పోలీసులు గ్రేట్..!

చిత్తూరు: కార్వేటినగరం మండలంలో మందుబాబుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాలను పోలీసులు రూపు మార్చుతున్నారు. ఎస్పీ తుషార్ డూడీ ధైర్య స్పర్శ అనే ఓ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ తేజస్విని సిబ్బందితో కలిసి మందుబాబులకు అడ్డాగా ఉన్న అమ్మపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడి చెత్త తొలగించారు. మందుబాబులు కూర్చోకుండా ప్రదేశాలను నీటిగా రెడీ చేస్తున్నారు.

February 24, 2026 / 10:29 AM IST

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక వాహన తనిఖీలు

ATP: నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అరికట్టడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:27 AM IST

రావులపాలెం రైతు బజార్‌కు నేడు వారాంతపు సెలవు

కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్‌కు ఇకపై ప్రతి మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..వారాంతపు సెలవుగా నిర్ణయించినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ సోమవారం తెలిపారు. కావున రైతులు, వ్యాపారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కావున మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని,వినియోగదారులు ఈ మార్పును గమనించాలన్నారు.

February 24, 2026 / 10:27 AM IST

10KG టమాటా బాక్స్ రూ.100..!

అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాల మార్కెట్‌కు 66 వేల కిలోల (66 మెట్రిక్ టన్నుల) టమాటాలను రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.140, రెండవ రకం రూ.110, మూడవ రకం రూ.100లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగానే టమాటాలకు రేట్లు పెరగడంలేదని, దిగుబడి పెరిగినా.. గిట్టుబాటు ధరలు పలకడం లేదని రైతులు వాపోతున్నారు.

February 24, 2026 / 10:26 AM IST

లింగంగుంట్లలో కార్డన్ సెర్చ్ నిర్వహణ

PLD: పెదకూరపాడులోని లింగంగుంట్ల గ్రామంలో మంగళవారం ఉదయం పోలిసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు పాల్గొని గ్రామంలో క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలను గుర్తించారు. కొడవళ్ళు గుడ్డలు మారణా యుద్ధాలను కొన్నిటిని గుర్తించారు. సీఐ సురేష్, శ్రీనివాసరావు, ఎస్సై గిరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 10:16 AM IST