• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రూ.14 కోట్లకు IP.. పలమనేరు సీఐ ఏమన్నారంటే??

చిత్తూరు: పలమనేరులో వెంకట్రావు అనే వ్యక్తి సుమారు రూ.14 కోట్లకు ఐపీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బాధితులు అంతా కలిసి పలమనేరు సీఐ మోహన్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సీఐ ఇలాంటి అనధికారిక చీటీలు వేయవద్దని ప్రజలకు సూచించారు.

February 24, 2026 / 01:15 PM IST

త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు: MPDO అప్పాజీ

CTR: పుంగనూరులోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు MPDO అప్పాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య రాకుండా రూ.25 లక్షలతో వివిధ గ్రామాల్లో బోర్లు వేస్తున్నట్లు చెప్పారు. మండల పరిధిలో 624 బోర్లు ఉన్నాయని అన్ని పనిచేస్తున్నాయన్నారు. నీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 01:15 PM IST

వాయు లింగేశ్వరుని సేవలో డిప్యూటీ సీఎం సలహాదారు

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సలహాదారులు రత్నం విచ్చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వయంగా వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం ఆయనకు అందజేశారు.

February 24, 2026 / 01:12 PM IST

పశ్చిమలో రెచ్చిపోతున్న ‘లంచా’వతారాలు

W.G: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో వరుస అవినీతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ACBకి చిక్కడం సంచలనంగా మారింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడిన 48 గంటల్లోనే, భీమవరంలో అటవీశాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరకడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

February 24, 2026 / 01:10 PM IST

‘విద్యార్థులు మంచి ఉపన్యాసకులగా తయారవ్వాలి’

VZM: విద్యార్థులు మంచి ఉపన్యాసకులుగా తయారు కావాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డా. మిరియాల కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం వక్త పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.

February 24, 2026 / 01:09 PM IST

ఎర్రగుంట్ల సుందరయ్య నగర్‌లో నాకాబందీ

KDP: తెల్లవారుజామున ఎర్రగుంట్ల సీఐ కె.విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది మెరుపు తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇళ్లను సోదాలు చేశారు. ఎలాంటి రికార్డు లేని 12 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు.

February 24, 2026 / 01:06 PM IST

కాశీబుగ్గ శ్రీ సంతోషిమాత ఆలయంలో చోరీ

SKLM: కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి తూలంపావు బంగారు ఆభరణాలు చోరీ చేశారని ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 01:03 PM IST

సింహాద్రిపురంలో రెండోవ రోజు ఏసీబీ దాడులు

KDP: సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 2వ రోజుకూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పలు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిన్న సింహాద్రిపురం ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. మంగళవారం ఏసీబీ అధికారులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.

February 24, 2026 / 01:03 PM IST

లబ్ధిదారురాలుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

అన్నమయ్య: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారురాలు రాజుల లక్ష్మీదేవికి రూ.2,14,698 విలువైన చెక్కును ముక్కా వరలక్ష్మి మంగళవారం అందజేశారు. ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సహాయం అందేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 01:01 PM IST

అతిసారం పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

SKLM: అతిసారం కేసుల నేపథ్యంలో కలెక్టరేట్‌‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08942-229080 నంబర్ ద్వారా ప్రజలు సహాయం పొందవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డయేరియా ప్రభావిత ప్రాంతాల ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. గత రెండు, మూడు రోజులుగా నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు.

February 24, 2026 / 01:01 PM IST

వాడపల్లి నిత్య అన్నదాన పథకానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించే అన్నదాన పథకానికి రాజమహేంద్రవరం వాస్తవ్యులు మిధున్ చక్రవర్తి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని మంగళవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ధాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

February 24, 2026 / 12:58 PM IST

ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు

W.G: నరసాపురం పట్టణంలో మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వైఎన్.కళాశాల, సూర్య, గౌతమి, ఆదిత్య, భాస్కర కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షల దృష్ట్యా కేంద్రాల పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు.

February 24, 2026 / 12:48 PM IST

హిజ్రాకు ఐడీ కార్డు అందజేసిన జేసీ మౌర్య భరద్వాజ్

SS: పుట్టపర్తి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం కదిరికి చెందిన ఎస్. ఫరూఖ్ అనే హిజ్రాకు ఐడీ కార్డు నుంచి సర్టిఫికెట్‌ను జేసీ అందజేశారు. జిల్లాలో అర్హులైన హిజ్రాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే కార్డులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ పథకాలు పొందడానికి ఈ గుర్తింపు కార్డులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

February 24, 2026 / 12:46 PM IST

సర్పంచ్‌లు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ

ELR: గ్రామాలలో ఆదాయ వనరులను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని గణపవరం ఎంపీడీవో పివి.సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:44 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకాలు

PLD: పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శంకరమంచి రాజేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకన్నారు.

February 24, 2026 / 12:44 PM IST