కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు LXI, VXI, ZXI వేరియంట్లలో పెట్రోల్, CNT ఆప్షన్లలో లభిస్తుంది. 1999లో ఆవిష్కరించినప్పటి నుంచి 32.50 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడు పోయాయి. మిడ్ సైజ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో వ్యాగన్ఆర్ కార్లది 64శాతం వాటా ఉంటుంది.