అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లైంది.