»Wagh Bakri Tea Group Parag Desai Passed Away After Stray Dog Attack
Wagh Bakri: వీధికుక్కల దాడిలో టీ పొడి కంపెనీ యజమాని మృతి
వాగ్ బక్రీ ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. వీధికుక్కల దాడిలో గాయపడి బ్రెయిన్ ఇంజరీ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
Wagh Bakri: ఇటీవల కాలంలో వీధి కుక్కలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారం రోజుల క్రితం కుక్కల దాడిలో ఓ పసికందు మృతి చెందింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీధికుక్కల దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. వీధికుక్కల దాడిలో ప్రముఖ వ్యాపార వేత్త కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. వాగ్ బక్రీ ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. వీధికుక్కల దాడిలో గాయపడి బ్రెయిన్ ఇంజరీ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. పరాగ్ దేశాయ్‌కు భార్య విదిసా, కుమార్తె పరిషా ఉన్నారు. అక్టోబరు 15న పరాగ్ ఇంటి సమీపంలో వీధికుక్కలు దాడి చేసి కిందపడేశాయని స్థానికులు తెలిపారు.
పరాగ్ తలకు గాయమైంది. వెంటనే గుజరాత్‌లోని షెల్బీ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స నిమిత్తం జైడస్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఏడు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మెదడులో రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. వాఘ్ బక్రీ టీ గ్రూపుకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు.. పరాగ్ దేశాయ్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. వాఘ్ బక్రీ గ్రూప్‌ను 1892లో నారందాస్ దేశాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2000 కోట్లు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాపారం జరుగుతుంది.