వివో కూడా ఎక్స్ ఫ్లిప్ పేరుతో మోడల్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ ప్రకటించలేదు. కానీ డిజిటల్ చాట్ స్టేషన్ ‘టిప్స్టార్’ ఫోటోను చైనా సోషల్ మీడియా విబోలో షేర్ చేశారు.
Vivo X Flip:ఇప్పుడు ఫ్లిప్ మొబైల్స్ సీజన్ నడుస్తోంది. అన్నీ కంపెనీలు ఫ్లిప్ మోడల్స్ తీసుకొస్తున్నాయి. వివో కూడా ఎక్స్ ఫ్లిప్ (Vivo X Flip) పేరుతో మోడల్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ ప్రకటించలేదు. కానీ డిజిటల్ చాట్ స్టేషన్ ‘టిప్స్టార్’ ఫోటోను చైనా సోషల్ మీడియా విబోలో షేర్ చేశారు. దీంతో వివో (vivo) మొబైల్ ఫీచర్లు, ధర, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆసక్తి నెలకొంది.
ఆ లీక్ ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఎస్వోసీ ఉంటుంది. అలాగే 6.8 ఇంచుల ఒలెడ్ ప్యానెల్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మొబైల్ ప్రీమియం లుక్ ఉంది. ప్లిప్ ఓపెన్ చేస్తే.. విశాలంగా మంచి వీడియో చూసే వెసులుబాటు ఉంది. మొబైల్కు (mobile) డ్యుయల్ రియర్ కెమెరా ఇచ్చారు. 50 మెగా పిక్సెల్ సోని ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ సోని అల్ట్రా వైడ్ కెమెరా ఉంది.
మొబైల్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరెజ్ సామర్థ్యం రానుంది. 44 వాట్ల సామర్థ్యంతో వస్తుండగా.. ఫాస్ట్ ఛార్జీంగ్ అవుతుంది. అయితే ఈ మొబైల్ ధర (mobile) వివరాలు తెలియరాలేదు. భారత మార్కెట్లో రూ.లక్ష వరకు ఉండొచ్చు. అలాగే విడుదల తేదీ గురించిన సమచారం తెలియరాలేదు.