»Uday Kotak Resigned As Ceo Of Kotak Mahindra Bank
Kotak మహీంద్రా బ్యాంక్ సీఈవో పదవీకి ఉదయ్ రాజీనామా
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్ తన పదవీకి రాజీనామా చేశారు. ఆర్బీఐ నిబంధనల మేరకు ఓ వ్యక్తి 15 ఏళ్ల కన్నా ఎక్కువ రోజులు ఆ పదవీలో ఉండొద్దు. దాంతో ఆయన రాజీనామా చేశారు.
Uday Kotak: కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ పదవీకి ఉదయ్ కోటక్ (Uday Kotak) రాజీనామా చేశారు. సీఈవో పదవీకి ఒక వ్యక్తి 15 ఏళ్ల కన్నా ఎక్కువ రోజులు పదవీలో ఉండొద్దనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు రాజీనామా చేశారు. ఆయన సీఈవో పదవీలో డిసెంబర్ వరకు ఉండొచ్చు.. ముందుగానే పదవీ నుంచి వైదొలిగారు. కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మాత్రం కొనసాగుతారు. తన రాజీనామా లేఖను బోర్డు చైర్మన్ ప్రకాశ్ ఆప్డేకు అందజేశారు.
ఉదయ్ కోటక్ రాజీనామా చేయడంతో జాయిండ్ ఎండీ దీపక్ గుప్తా.. తాత్కాలిక ఎండీగా కొనసాగుతారు. డిసెంబర్ వరకు చైర్మన్, జాయింట్ ఎండీ కూడా రాజీనామా చేయాల్సి ఉంది. సులువుగా అధికార మార్పిడి జరగాలనే ఉద్దేశంతో రాజీనామా చేశానని ఉదయ్ కోటక్ అన్నారు. 1985లో ఎన్బీఎఫ్సీని ఉదయ్ స్థాపించారు. 2003 నాటికి కమర్షియల్ బ్యాంక్‌గా తీర్చిదిద్దారు. మార్కెట్ పరంగా మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా ఉంది.
ముగ్గురితో ప్రారంభించిన బ్యాంక్.. ప్రముఖ బ్యాంక్‌గా మారింది. భారతదేశంతోపాటు 5 దేశాల్లో లక్ష మంది ఉద్యోగులతో సేవలను అందిస్తోంది. ఈ ప్రయాణం తనకు ఆనందం కలిగించింది. వారసత్వ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే బ్యాంక్ చర్యలు తీసుకుంది. మరికొన్ని నెలలు తన సమయాన్ని కుటుంబం, సేవా కార్యక్రమాల కోసం కేటాయించాలని అనుకుంటున్నానని తెలిపారు. తన పెద్ద కుమారుడి పెళ్లి ఉంది.. ఇదే సరైన సమయంగా భావించి.. వైదొలుగుతున్నా అని తెలిపారు.