Festival Season: పండుగ సీజన్ మొదలైంది. మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. కోవిడ్ తర్వాత ప్రస్తుతం పండగలు జరుపుకునేందుకు ప్రజలు చాల ఉత్సాహంగా ఉన్నారు. ఈ కారణంగానే ప్రస్తుత పండగల సీజన్లో 85 రోజుల్లో సెకనుకు రూ.4 లక్షల వ్యాపారం అంటే మొత్తం రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. గతేడాది పండుగ సీజన్లో రూ.2.50 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనాల గురించి తెలుసుకుందాం.. ఈ ఏడాది రక్షా బంధన్‌తో పండుగ సీజన్ ప్రారంభమైంది. తర్వాత నవరాత్రి, దసరా, దుర్గాపూజ, కర్వా చౌత్, ధంతేరస్, దీపావళి, భాయ్ దూజ్, ఛత్ పూజ, చివరగా తులసి వివాహం వంటి అనేక ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. ఈ పండుగ సీజన్లో భారతీయ వినియోగదారులు దాదాపు రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ప్రతి సెకనుకు 4 లక్షల లావాదేవీలు
క్యాట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. దేశంలో మెయిన్‌లైన్ రిటైల్ వ్యాపారం కోసం దాదాపు 60 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతి వినియోగదారుడు రూ. 5000 ఖర్చు చేస్తే వ్యాపారం ఆటోమేటిక్‌గా రూ. 3 లక్షల కోట్లు అవుతుంది. ఈ లెక్కన మరికొంత విస్తరిస్తే 85 రోజుల్లో ఒక్కరోజులోనే రూ.3500 కోట్లకు పైగా వ్యాపారం జరగనుంది. ఇదే వ్యాపారం ప్రతి గంటకు రూ.147 కోట్లకు పైగా జరుగుతుందని అంచనా. ప్రతి నిమిషానికి రూ.2.45 కోట్లకు పైగా, సెకనుకు రూ.4 లక్షలకు పైగా టర్నోవర్ జరుగుతుందని అంచనా. పండుగల సీజన్‌ను ఘనంగా జరుపుకోవాలన్నారు ప్రజలు. గృహోపకరణాలు, బహుమతులు, దుస్తులు, ఆభరణాలు, అనుకరణ ఆభరణాలు, పాత్రలు, అలంకార వస్తువులు, ఫర్నిచర్ & ఫిక్చర్లు, కిచెన్వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు & పెరిఫెరల్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, స్వీట్లు తదితరాల కోసం ఖర్చు చేయనున్నారు.