»Sale Of 51 Stake In Kotak Insurance For Rs 4051 Crore Zurich Insurance
Kotak Insurance:లో 51% వాటా సేల్..రూ.4051 కోట్లకు
జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటాను పొందేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.4,051 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కోటక్ సంస్థ ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా ఈ మేరకు ప్రకటించారు. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ వచ్చే మూడేళ్లలోపు 19 శాతం అదనపు వాటాను కొనుగోలు చేస్తుందన్నారు.
Sale of 51% stake in Kotak Insurance for Rs 4051 crore zurich insurance
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్, కోటక్ జనరల్ ఇన్సూరెన్స్(Kotak general Insurance)లో సగానికి పైగా అంటే 51% వాటాను స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.4051 కోట్లకు ఈ డీల్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు తర్వాత జ్యూరిచ్ ఇన్సూరెన్స్ మూడేళ్లలో కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మరో 19 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది.
ఇది తాజా వృద్ధి మూలధనం, వాటా కొనుగోలులో భాగంగా ఉంటుంది. జ్యూరిచ్ ఇన్సూరెన్స్(zurich insurance) కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా, మూడేళ్లలో 19 శాతం వాటాను కూడా కొనుగోలు చేస్తోంది. ఎక్కువ శాతం వాటా కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రపంచ వ్యూహాత్మక బీమా సంస్థ చేసిన అతిపెద్ద పెట్టుబడి ఇదేనని ఆర్థిక నిపుణలు అంటున్నారు. దీని ప్రభావం నేడు కోటక్ బ్యాంక్ షేర్లపై కనిపించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి రూ.1758కి చేరుకుంది
అయితే ఈ ఒప్పందానికి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ(RBI), ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఎ(IRDA), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. దీంతో దేశవ్యాప్తంగా కోటక్ మహీంద్రా గ్రూప్ ఉనికి, డిజిటల్ ఆస్తులు, B2B, B2C ఫార్మాట్లలో జ్యూరిచ్ పెట్టుబడితో డిజిటల్ రీచ్ పెరుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ MD, CEO దీపక్ గుప్తా అన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాధారణ బీమా పొందేందుకు మరింత సామర్థ్యం ఉంటుందన్నారు. బీమా విషయంలో భారతదేశం చాలా ముఖ్యమైన మార్కెట్ అని జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు అన్నారు.