ఫిన్‌టెక్ కంపెనీ Paytm మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (డిసెంబర్ 7న) భారీగా తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్‌లో మునుపటి రోజు కంటే 20 శాతం తక్కువగా ముగియడం విశేషం. అయితే అసలు ఒకేసారి అంత పెద్ద మొత్తం షేర్ ప్రైస్ ఎందుకు తగ్గిందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
Paytm shares hit 20 percent lower circuit december 7th 2023
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Paytm) షేర్లు గురువారం భారీగా 20% పడిపోయాయి. ట్రేడింగ్ సమయంలో ఈ షేర్ రూ.650.65 కనిష్ట స్థాయికి వచ్చింది. క్రితం ముగింపు షేరు రూ.813.30 ఉండటం విశేషం. ఈ షేర్ అక్టోబర్ 20, 2023న 52 వారాల గరిష్ట స్థాయిలో రూ.998.30 వద్ద ఉంది. వాస్తవానికి Paytm తన చిన్న స్థాయి పోస్ట్‌పెయిడ్ లోన్లను తగ్గించే ప్రణాళికలను ప్రకటించిన క్రమంలోనే ఇది జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటివల అన్సెక్యూర్డ్ లోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించడంతో Paytm ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయం బ్రోకరేజీ సంస్థలతోపాటు ఇలా లోన్స్ ఇచ్చే సంస్థలపై కూడా ప్రభావం చూపింది. ఆ క్రమంలో కంపెనీకి తమ ఆదాయ అంచనాలను తగ్గించవలసి వచ్చింది.
Paytm ప్రకారం కంపెనీ 50,000 రూపాయల కంటే తక్కువ సెక్యూర్డ్ రుణాల స్థాయిని క్రమంగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. పోస్ట్‌పెయిడ్ అనేది ప్రధానంగా రూ.50,000 కంటే తక్కువ ఉండే లోన్ పోర్ట్‌ఫోలియో. దీనిని Paytm నుంచి అనేక మందికి ఇవ్వడం అనే నిర్ణయాన్ని క్రమంగా తగ్గించనున్నారు. ఈ క్రమంలో తర్వాత, పోస్ట్‌పెయిడ్ లోన్లు సగానికి సగం తగ్గిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇది మార్జిన్లు లేదా రాబడిపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇటివల ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో రూ.50,000 కంటే తక్కువ లోన్ పంపిణీని తగ్గించి, అధిక మొత్తంలో వ్యాపార రుణ పంపిణీని విస్తరింపజేంపజేయాలని సంస్థ చూస్తోంది.
ఈ నేపథ్యంలో Paytm ‘ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి’ (BNPL) వ్యాపారాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. నిజానికి, సెక్యూర్డ్ రుణాలు ఇవ్వడంపై రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి చర్య తీసుకున్న తర్వాత, రుణ భాగస్వాములు వెనక్కి తగ్గారు. జెఫరీస్ ప్రకారం మొత్తం పంపిణీలలో 55 శాతం వాటా కలిగిన BNPL పంపిణీలు రాబోయే 3-4 నెలల్లో సగానికి తగ్గుతాయని అంటున్నారు. అయితే అసురక్షిత రుణాల సెంటిమెంట్ ఈ స్టాక్‌పై ప్రభావం చూపుతాయని CLSA భావిస్తోంది.