రైలు రవాణా కారిడార్లు, షిప్పింగ్ కారిడార్ల ద్వారా అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య ఆసియా, దక్షిణాసియాలను అనుసంధానించే ప్రణాళికకు త్వరలోనే అంకురార్పణ జరుగనుంది.
కరణ్‌వీర్ సింగ్ ఢిల్లీలో హోటల్ మేనేజ్‌మెంట్ చదివారు. ఆ తర్వాత దుబాయ్‌లోని ఓ హోటల్‌లో 12 ఏళ్లు పనిచేశాడు. అక్కడ అతనికి నెలకు రూ.1.25 లక్షల జీతం వచ్చేది.
Sovereign Gold Bond Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు ఈ బంగారాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద చౌక బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
కేవలం 2 రోజుల్లోనే ఆపిల్ 200 బిలియన్ డాలర్లు అంటే 20 వేల కోట్ల డాలర్లకు పైగా నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. Apple షేర్లు ప్రస్తుతం సుమారు 178డాలర్లు. గత కొద్దిరోజులుగా యాపిల్ షేర్లు 6 శాతానికి పైగా పడిపోయాయి.
భారత్‌లో ఎఐ సాయంతో సూపర్ కంప్యూటర్లను తయారుచేేసేందుకు రిలయన్స్, టాటా గ్రూప్ రెండు దిగ్గజ కంపెనీలు అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ Nvidia తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రిలయన్స్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.
కాలంతో పాటు టెక్నాలజీ రోజు రోజుకు మారుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా రోజుకో కొత్త మార్పులు వస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా యూపీఐ ఏటీఎం అందుబాటులోకి రావడానికి ఇదే కారణం. ఇప్పుడు UPI సహాయంతో వినియోగదారులు డెబిట్ లేదా ATM కార్డ్ లేకుండా కూడా ATM నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
పెరుగుతున్న పప్పుల ధరలకు బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కందిపప్పు స్టాక్‌ను వాటాదారులందరూ వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వ్యాపారులు ప్రతి శుక్రవారం వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కంది పప్పు స్టాక్‌ను వెల్లడించాలి.
ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక శక్తులన్నీ భారత్ కు రాబోతున్నాయి. మొట్టమొదటిసారిగా భారతదేశం G20కి ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులు ఈ వారం న్యూఢిల్లీలో G20 సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది.
పీవీఆర్ ఐనాక్స్‌లో 4.48 లక్షల అడ్వాన్స్ టిక్కెట్లు బుక్ అయ్యాయని తరణ్ ఆదర్శ్ ఒక రోజు క్రితం ట్వీట్ చేశారు. సినీపోలీస్‌లో 1.09 లక్షల టిక్కెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అంటే డిజిటల్ కరెన్సీకి సంబంధించి UPIని స్కాన్ చేయడం ద్వారా కస్టమర్‌లు చెల్లింపు చేసే సౌకర్యాన్ని SBI ప్రారంభించింది. బ్యాంక్ ఈ సదుపాయాన్ని ఇంటర్‌ఆపరేబిలిటీగా పేర్కొంది. దీంతో కస్టమర్లకు డిజిటల్ కరెన్సీలో లావాదేవీలు చేయడం సులభం అవుతుంది.
ప్రస్తుతం టాటా కన్స్యూమర్ కూడా హల్దీరామ్‌లో వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. టాటా కన్స్యూమర్ హల్దీరామ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయవచ్చు. హల్దీరామ్ ఈ వాటాను విక్రయించడానికి 10 బిలియన్ డాలర్లను కోరింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి 88 శాతం పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు సెప్టెంబర్ 5 వరకు ప్రాసెస్ చేయబడ్డాయి. ఇప్పటివరకు 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడ్డాయి.
ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు, కుటుంబాలు, వ్యాపారాలు దీర్ఘకాలిక పొదుపులు, పెట్టుబడి ప్రణాళికలను రూపొందించడానికి సహాయపడిందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైమండ్ జూబ్లీ లెక్చర్‌లో ఆర్‌బిఐ గవర్నర్ ప్రసంగంలో తెలిపారు.
Onion Price Hike: రాబోయే రోజుల్లో ఉల్లి ధర సామాన్యుడిని కంటతడి పెట్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన ఉల్లి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది.