పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ అక్టోబర్ 2 నుండి భారతదేశంలో Chromebooks తయారీకి Googleతో చేతులు కలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది.
ఈ ఏడాది ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. భారత్ ఒంటరిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఇది ఇక్కడి అనేక రంగాలు, కంపెనీల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది.
దేశంలోని విస్కీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విస్కీలలో స్థానం సంపాదించుకుంది. దీంతో విస్కీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వార్షిక ప్రాతిపదికన ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో GST నుండి ప్రభుత్వ ఖజానాకు రూ. 1,62,712 కోట్లు వచ్చాయి.
అక్టోబర్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం దేశీయ సహజ వాయువు ధరలను పెంచింది. ఈ పెరుగుదల తర్వాత దేశీయ సహజ వాయువు ధర $8.60/MMBTU నుండి $9.20/mBtuకి పెరిగింది. కొత్త రేట్లు ఆదివారం అంటే అక్టోబర్ 1, 2023 నుండి అక్టోబర్ 31, 2023 వరకు వర్తిస్తాయని ప్రభుత్వం సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల విక్రయం గురించి మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం(Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని "చట్టబద్ధమైన లంచం"గా అభివర్ణించారు. తాజాగా అక్టోబర్ 4న మళ్లీ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది బీజేపీకి "బంగారు పంట" అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విదేశీ మారక నిల్వల్లో క్షీణత వరుసగా మూడో వారం కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో విడుదల చేసిన డేటా ప్రకారం, గత వారం 2.33 బిలియన్ డాలర్ల క్షీణత నమోదైంది. గత వారం అంటే సెప్టెంబర్ 15తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 593.03 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇందులో కూడా 5 బిలియన్ డాలర్ల క్షీణత నమోదైంది.
నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ కూడా తన విధానాన్ని మార్చుకుంది. ఈ ఏడాది జూలైలో నెట్‌ఫ్లిక్స్ భారతీయ వినియోగదారులు తమ ఇంటి వెలుపల తమ పాస్‌వర్డ్‌లను పంచుకోకుండా నిషేధించింది. ఇప్పుడు డిస్నీ కూడా నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది.
దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. గత ఎనిమిది నెలల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కొత్త ఇన్వెస్టర్ల నమోదు కోటికి చేరుకుంది.
మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ఎందుకంటే గత 10 రోజుల్లో పుత్తడి రేటు ఏకంగా 3 రూపాయలకుపైగా తగ్గింది. అయితే ఈరోజు గోల్డ్ రేటు ఎంత ఉంది సహా మరికొన్ని విషయాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుడు 79 ఏళ్ల అశ్విన్ డానీ కన్నుమూశారు. అతను ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని నిర్వహించాడు. కంపెనీ బోర్డు సభ్యుడు కూడా. ఏషియన్ పెయింట్స్‌లో అతని ప్రయాణం 1968లో ప్రారంభమైంది.
వరుసగా మరో రోజు స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ ఫ్లాట్ అయింది. నేటి సెషన్లో మిడ్‌క్యాప్ స్టాక్‌లలో కూడా అమ్మకాలు కనిపించాయి.