»Now Make Rupay Credit Card Debit Card Payments Without Cvv How It Works
RuPay Card: రూపే కార్డు వాడే వారికి శుభవార్త..!
ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వారేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడేవారే. అలాంటివారికి ఇది నిజంగా శుభవార్తే. కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డెబిట్ కార్డు వాడే వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సీవీవీ నెంబర్ లేకుండానే ఇకపై మీరు పేమెంట్లు చేయొచ్చు. రూపే క్రెడిట్ కార్డు, రూపే డెబిట్ కార్డు వాడే వారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇకపై వీరు సీవీవీ నెంబర్ లేకుండానే కార్డు ద్వారా చెల్లింపులు చేయొచ్చు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, వంటి యాప్స్ ద్వారా కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తొలిసారి కొనుగోలు చేసే వారు కార్డుకు సంబంధించిన నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ పూర్తి చేయాలి. ఆ వివరాలు ఒకప్పుడు ఆయా కంపెనీల వద్ద ఉండేవి. ఏదైనా సైబర్ దాడి జరిగినప్పుడు ఈ వివరాలు బయటకు వచ్చే ప్రమాదం ఉండడంతో ఆర్బీఐ టోకనైజేషన్‌ను తీసుకొచ్చింది.
ఒక సారి సీవీవీ , ఓటీపీ ఎంటర్ చేసి మీ కార్డును టోకనైజేషన్ పూర్తి చేస్తే ఇక ప్రతి సారీ కార్డు వివరాలు ఇవ్వనవసరం లేదు. ఒక వేళ టోకనైజ్ చేసేందుకు సదరు సంస్థకు అనుమతి లేకుంటే మీరు ట్రాన్సాక్షన్లు జరిపే ప్రతిసారీ కార్డు వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే టోకనైజ్ చేసిన వారు ప్రస్తుతం ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేందుకు సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేయాలి. కానీ, ఇకపై రూపే కార్డు యూజర్లు మాత్రం సీవీవీ ఎంటర్ చేయాల్సిన పని లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా అభివృద్ది చేసిన దేశీయ కార్డు నెట్వర్క్. దీని వినియోగం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం తెచ్చిన ఎన్పీసీఐ.. ఇప్పుడు సీవీవీ లేకుండా లావాదేవీలు చేసుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. దీంతో రూపే క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు వాడుతున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్, నెట్ బ్యాంకింగ్‌లో సీవీవీ లేకుండానే ట్రాన్సాక్షన్లు వేగంగా పూర్తి చేయవచ్చు. ఇప్పటికే వీసా కార్డు దారులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.