»Mumbai Businessman Bk Goenka Bought The Penthouse For Rs 240 Crores
pent house:ను రూ.240 కోట్లకు కొన్న వ్యాపారవేత్త
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్‌లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
పెంట్ హౌస్(pent house) రూంలో ఉంటే ఆ హాయినే వేరని చెప్పవచ్చు. అందరి కంటే పైన ఉంటూ చక్కగా ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ జీవించవచ్చు. అంతేకాదు ఇరుగుపొరుగు వాళ్లతో ఇబ్బందులు, గొడవలు కూడా ఉండవు. ఇలా అనేక కారణాలతో పెంట్ హౌస్ ఇళ్లకు భారీగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అందుకే బ్యాచ్ లర్స్ తోపాటు కొన్ని ఫ్యామిలీలు కూడా పెంట్ హౌస్ రూంలలో ఉండాలని, ఆ ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే ప్రాంతాలను బట్టి పెంట్ హౌస్ లకు డిమాండ్ ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంటుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయి(mumbai)లో వీటికి చాలా డిమాండ్ ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది.
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ఓ వ్యాపార వేత్త భారీ ధరకు కొనుగోలు చేశారు. అది ముంబయి వర్లీ(Worli)లో త్రీ సిక్స్టీ వెస్ట్(Three Sixty West)లో ఉంది. విలాసవంతమైన టవర్లోని ట్రిప్లెక్స్ పెంట్‌హౌస్‌ను పారిశ్రామికవేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా(bk goenka) 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇది భారతదేశలోనే అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లావాదేవీగా నిలిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టవర్ B పెంట్ హౌస్ 63వ, 64వ, 65వ స్థాయిలలో ఉందని పలువురు అంటున్నారు. ఆ ప్లాట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఇటీవల పూర్తైనట్లు తెలుస్తోంది.
ఇక ముంబయిలో మురికివాడల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మురికివాడల కుటుంబాలకు ఉచితంగా 300 చదరపు అడుగుల అపార్ట్మెంట్ లను అక్కడి ప్రభుత్వం పలువురికి పంపిణీ చేసింది. వీటి విలువ కంటే ఈ పెంట్‌హౌస్ వాల్యూ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఏప్రిల్ 2023 నాటికి సెక్షన్ 54 కింద దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై గరిష్ట పన్ను మినహాయింపు రూ.10 కోట్లకు కేంద్రం పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో సంపన్నులు పన్ను మినహాయింపు అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో అల్ట్రా-లగ్జరీ సెగ్మెంట్లో భాగంగా సమీప భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని డీల్స్ వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్(real estate) నిపుణులు ఆశిస్తున్నారు. ఈ ట్రెండ్ మరిన్ని నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున విస్తరిస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలో పెంట్ హౌస్((pent house) లకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉందని గుర్తించిన త్రీ సిక్స్టీ వెస్ట్ బిల్డర్ వికాస్ ఒబెరాయ్(Oberoi Realty)అలాంటి మరో నిర్మాణం కోసం తదుపరి వింగ్‌లో రెండో పెంట్‌హౌస్ కోసం రూ.240 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్త, బిల్డర్ సుధాకర్ శెట్టితో కలిసి, ఒబెరాయ్ స్వయంగా ఈ త్రీ సిక్స్టీ వెస్ట్ సంస్థను సృష్టించాడు. అయితే త్రీ సిక్స్టీ వెస్ట్(Three Sixty West) ను రూ.4,000 కోట్లకు కొనుగోలు చేసినట్లు రియల్టర్ ఒబెరాయ్ గత వారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశాడు. ఇది 5.25 లక్షల చదరపు అడుగులు ఉందని, వీటిలో 63 అపార్ట్మెంట్లు ఉన్నాయని వెల్లడించారు.