»Google To Remove Inactive Gmail Accounts From December 2023
Google భారీ షాక్.. నిరుపయోగ జీమెయిల్ ఖాతాలన్నీ డిలీట్..
అప్పటివరకు ఎవరైనా అవసరమైన వారు ఆయా ఖాతాలను యాక్టివ్ చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గూగుల్ గొప్ప లక్ష్యం పెట్టుకుంది. యాక్టివ్ లేని జీమెయిల్ ఖాతాలను తొలగింపుతో గూగుల్ అకౌంట్లకు భద్రత లభిస్తుందని భావిస్తోంది.
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) సంచలన నిర్ణయం తీసుకుంది. జీమెయిల్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. నిరుపయోగంగా ఉన్న జీ మెయిల్ (Gmail Accounts) ఖాతాలన్నింటిని తొలగించాలని (Delete) నిర్ణయించింది. రెండేళ్లుగా వాడకుండా ఉన్న జీమెయిల్స్ ఖాతాలను తొలగించినున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పలు సోషల్ మీడియాకు (Social Media) చెందిన కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
జీమెయిల్స్ తో పాటు యూట్యూబ్ (YouTube), డాక్స్ (Google), డ్రైవ్ (Drive), మీట్ (Meet), క్యాలెండర్ తదితర ఖాతాలు కూడా డిలీట్ అవుతాయి. రెండేళ్లుగా సైన్ ఇన్ (Sign In) చేయని (లాగిన్) ఖాతాలను డిలీట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. ఈ ప్రక్రియ డిసెంబర్ (December) నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అప్పటివరకు ఎవరైనా అవసరమైన వారు ఆయా ఖాతాలను యాక్టివ్ చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గూగుల్ గొప్ప లక్ష్యం పెట్టుకుంది. యాక్టివ్ లేని జీమెయిల్ ఖాతాలను తొలగింపుతో గూగుల్ అకౌంట్లకు భద్రత లభిస్తుందని భావిస్తోంది. వీటితో అనేక పేర్ల మీద ఖాతాలు తెరచి చాలా మంది గూగుల్ అకౌంట్లను దుర్వినియోగం (Mis Use)చేస్తున్నారని గూగుల్ గుర్తించింది.
ఖాతాల తొలగింపుతో గూగుల్ అకౌంట్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని గూగుల్ భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం 2020లోనే ప్రకటించింది. వాడుకలో లేని చాలా ఖాతాలు తమ టు స్టెప్ వెరిఫికేషన్ (Verification)ను పూర్తి చేయలేవు. దీంతో ఆ ఖాతాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే గూగుల్ ఖాతాల తొలగింపు ప్రక్రియ చేపట్టనుంది. కాగా, ఈ నిర్ణయంతో చాలా యూట్యూబ్, సోషల్ మీడియా నిర్వహిస్తున్న కంపెనీలు ప్రమాదంలో పడ్డాయి. ఎందుకంటే తమ యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు (ఫేక్ అకౌంట్లు) తెరచి తమ సబ్ స్క్రైబర్లు (Subscribers), ఫాలోవర్లు (Followers) పెంచుకుంటున్నాయి. ఆయా చానల్స్ ను ఫాలోవుతున్న చాలా ఖాతాలు వాడుకలో లేనివే ఉంటాయి. గూగుల్ నిర్ణయంతో తమ ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు తగ్గుతారని ఆయా యూట్యూబ్ చానల్స్ భావిస్తున్నాయి.