Gold Rates Today : వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధర
వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి. పసిడి ధర శనివారం స్వల్పంగా తగ్గగా వెండి ధర మాత్రం భారీగా పెరిగిపోయింది. ఏది ఎంత పెరిగిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ధర శుక్రవారం రూ.68,324 ఉండగా, శనివారం నాటికి రూ.96 తగ్గింది. దీంతో ఇప్పుడు దీని ధర రూ.68,228గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.68,228గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate)లు భారీగా పెరిగిపోయాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.75,650 ఉండగా, శనివారం నాటికి రూ.663 పెరిగి రూ.76,313కు చేరుకుంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తగ్గింది. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2174 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 9 డాలర్లు తగ్గి 2165 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.68 డాలర్లుగా ఉంది.