»Gangajal Is Exempt From Gst Says Cbic After Media Reports On Applicability Of Gst On Gangajal
GST ON Gangajal: గంగా జలంపై జిఎస్టి.. స్పందించిన సీబీఐసీ.. అంతా తూచ్
దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గంగాజలాన్ని జీఎస్టీ పరిధిలోకి రానీయకుండా చేశారని సీబీఐసీ తెలిపింది. గంగా జలంపై జిఎస్టి విధిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయని సిబిఐసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాసింది.
GST ON Gangajal: గంగా జలంపై జీఎస్టీ విధింపుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వివరణ ఇచ్చింది. గంగా జలాలపై జీఎస్టీ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గంగాజలాన్ని జీఎస్టీ పరిధిలోకి రానీయకుండా చేశారని సీబీఐసీ తెలిపింది. గంగా జలంపై జిఎస్టి విధిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయని సిబిఐసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాసింది.
గంగాజలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు పూజల కోసం ఉపయోగిస్తున్నారని సీబీఐసీ రాసింది. పూజ సామాగ్రి జీఎస్టీ నుండి దూరంగా ఉంచబడింది. 2017 మే 18-19, జూన్ 3, 2017 తేదీల్లో జరిగిన 14, 15వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పూజా సామాగ్రిపై జీఎస్టీ విధించే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో పూజ సామాగ్రిని జీఎస్టీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి గంగాజలాన్ని జీఎస్టీకి దూరంగా ఉంచారు.