»Infosys Q2 Results Showing 3 17 Percent Growth In Net Profit Came At 6212 Crore Rupees
Infosys Q2 Results: ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన.. కంపెనీ లాభం రూ.6212 కోట్లు
దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.
Infosys Q2 Results: దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 3.1 శాతం పెరిగింది. కంపెనీ ప్రస్తుత లాభం రూ.6,215 కోట్లకు చేరుకుందని తెలిపింది.
ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరింది
రెండో త్రైమాసిక ఫలితాల(Q2 Results) గురించి స్టాక్ మార్కెట్ల(stock markets)కు సమాచారం ఇస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. గత త్రైమాసికంలో కంపెనీ రూ.37,933 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇన్ఫోసిస్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాలను 1 నుండి 2.5 శాతానికి తగ్గించింది. ఇంతకు ముందు రెవెన్యూ గైడెన్స్ 1 నుంచి 3.5 శాతంగా ఉండేది.