TG: నిజామాబాద్ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో మహిళా అతిధి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్, చరిత్ర,ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. ఆసక్తి కలిగిన మహిళాలు తమ సర్టిఫికెట్లను తీసుకొని…ఈనెల 3న కళాశాలలో ఇంటర్వ్యూ, డెమో పరీక్షలకు హాజరు కావాలన్నారు.