కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, ముడి ఉత్పత్తుల గురించి నెలల పాటు చర్చలు జరిపిన అనంతరం ఈ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రిలయన్స్, ఓఎన్జీసీ వంటి సంస్థలకు ఊరట లభిస్తుంది.