ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్లను పెంచడానికి రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ నెలఖరులోగా 4 వేల స్టోర్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ‘X’లో ప్రకటన చేశారు. డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లూ ఒకేసారి ప్రారంభించనున్నట్లు తెలిపారు.