టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ… ఆదివారం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా… ఈ దర్యాప్తులో షాకిం్ విషయాలను పోలీసులు వెల్లడించారు.
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో… కారులో వెనక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ…. ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదట. సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు.
పాల్ఘర్లోని చరోటీ చెక్‌పోస్టు దాటిన తర్వాత కారు కేవలం 9 నిమిషాల్లో 20కి.మీ. మధ్యాహ్నం 2.21 గంటల ప్రాంతంలో చెక్‌పాయింట్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. చెక్‌పోస్టుకు 20 కిలోమీటర్ల దూరంలో సూర్య నదిపై వంతెనపై మెర్సిడెస్ వాహనం వెళ్తుండగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో కారు ఈ దూరాన్ని కేవలం తొమ్మిది నిమిషాల్లోనే అధిగమించిందని నివేదిక పేర్కొంది
ప్రమాద సమయంలో ఓ మహిళ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.
“ముంబయికి చెందిన ప్రముఖ వైద్యురాలు అనహిత పండోలే ఆ సమయంలో కారు నడుపుతున్నారు. ముందు సీట్లో ఆమె పక్కనే భర్త డారియస్ పండోలే కూర్చున్నారు. వెనుక సీట్లో డారియస్ సోదరుడు జహంగీర్ పండోలే, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కూర్చున్నారు.
పాల్ఘాట్ జిల్లాలో చరోటీ వద్ద అనహిత పండోలే రాంగ్ సైడ్ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు 120 కిమీ వేగంతో వెళుతోంది. కారు అదుపుతప్పడంతో డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సైరస్ మిస్త్రీతో పాటు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే కూడా మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అనహిత, ఆమె భర్త డారియస్ గాయాలతో బయటపడ్డారు” అని పోలీసులు వివరించారు.