ఉభయసభలు నిత్యం వాయిదా పడటంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చలు లేకుండా వాయిదా పడటంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్, అజ్మేర్ ఘటనలు, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయన్నారు. కానీ ప్రభుత్వానికి ఈ అంశాలపై చర్చించటం ఇష్టం లేఖ కావాలనే వాయిదా వేస్తున్నాయని ఆగ్రహించారు.