హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరగగా, వెండి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090 పెరిగి రూ.1,43,620కు చేరగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1000 పెరిగి రూ.1,31,650కు చేరింది. వెండి ధర ఒక్కరోజే రూ.15,000 పెరిగి కిలో రూ.3,07,000 గరిష్టాన్ని తాకింది. చరిత్రలో వెండి ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి.