AP: ఇవాళ్టి నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)కు సంబంధించి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ TET నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నవంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 10 నుంచి 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. DEC 2న హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే వచ్చే ఏడాది జనవరి 2న కీ, 19న ఫలితాలను విడుదల చేస్తారు.