థ్రెడ్ యాప్ వాడే వినియోగదారులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. థ్రెడ్ లోని మీ డేటా డిలీట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది.
ట్విట్టర్(Twitter)కు పోటీగా థ్రెడ్స్ యాప్(Thread App) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ను మెటా జులై 6న స్టార్ట్ చేసింది. థ్రెడ్స్ యాప్ వచ్చిన వెంటనే ఇండియా(India) సహా 100 దేశాల నుంచి కోటి మందికిపైగా డౌన్లోడ్(Downloads) చేసుకోవడం విశేషం. ఈ యాప్ ఇన్స్టాగ్రామ్(Instagram) ఖాతాకు కనెక్ట్ చేయడం వల్లే పనిచేస్తుందన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. ఈ యాప్ ఇప్పుడు లాంచ్ దశలో ఉండగా ఇంకొన్ని రోజుల తర్వాత ఇందులో కొన్ని మార్పులు జరగనున్నాయి.
థ్రెడ్ యాప్(Threads App) వల్ల సోషల్ మీడియా యూజర్లు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. థ్రెడ్ ప్రొఫైల్ నుంచి డేటాను డిలీట్ చేయాలనుకుంటే థ్రెడ్ ఖాతాకు కనెక్ట్ చేసి ఉండే ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయాల్సి ఉంటుంది. యూజర్లు థ్రెడ్ యాప్(Threads App)ను డిలీట్ చేయకుండా ఉండేందుకు మెటా(Meta) ఇలా ప్లాన్ చేసింది. ఈ నిబంధన వల్ల వినియోగదారులు కాస్తా ఇబ్బంది పడుతున్నారు.
థ్రెడ్ యాప్(Threads App)లోని మీ డేటా(Data)ను డిలీట్ చేయాలంటే కచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌ను తొలగించాల్సిందే. ఇది వినియోగదారులకు మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ఒక వేళ మీకు థ్రెడ్ యాప్ నచ్చకపోతే ఖాతాను డీయాక్టివేట్(Deactivate) చేసే అవకాశం ఉంది. అయితే మీ డేటా మాత్రం థ్రెడ్ యాప్ లోంచి తొలగించబడదు. ఈ విషయాన్ని థ్రెడ్స్ యాప్ వాడాలనుకునేవారు కచ్చితంగా గుర్తించుకోవాలి.