ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి చోటును కోల్పోయారు. వ్యాపార దిగ్గజం అయిన అదానీ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీతో పోటీపడుతున్నారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అదానీ అధినేతగా ఉన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ వంటి వ్యాపారాలో అధానీ దూసుకుపోతున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో అదానీ కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ సంస్థలకు ఆదాయం తగ్గుతూ వస్తోంది.
హిండెన్ బర్గ్ నివేదిక వల్ల గౌతమ్ అదానీ సంపద కరిగిపోతూ వస్తోంది. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారంగా చూస్తే ఆయన ప్రస్తుతం టాప్ 10 ధనవంతుల జాబితా నుంచి చోటను కోల్పోయారు. ప్రస్తుతం అదానీ 84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. గత మూడు రోజుల్లో ఆదాని సంపద 34 బిలియన్ డాలర్లు కోల్పోయింది. హిండెన్ బర్గ్ రిపోర్టు రాకముందు అదానీ మూడో స్థానంలో కొనసాగేవారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. అదానీ, అంబానీకి మధ్య వ్యాపార పరంగా గట్టి పోటీ అనేది నెలకొని ఉంది. తాజాగా అదానీ తన ర్యాంకును కోల్పోడంతో అందరి చూపు అంబానీపైకి వెళ్లింది.