AP: తెలంగాణలో ఈనెల 19 నుంచి 23 వరకు దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ ఫెయిర్లో ప్రదర్శించేందుకు ఏపీ నుంచి 35 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గతేడాది డిసెంబరు 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు, టీచర్లు HYDకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.