చాలా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్‌లు EMI పద్ధతిలో లోన్లు ఇస్తున్నాయి. అయితే సులభంగా లోన్ రావాలంటే.. సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రుణ చెల్లింపులో ఆలస్యం చేస్తే చెక్ బౌన్స్‌తో పాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. దీంతో భవిష్యత్తులో తీసుకునే రుణాలపై ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకుంటే.. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది.