ఈ నెలలో బ్యాంకులకు వరుసగా 4 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24న(నాలుగో శనివారం), 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం రోజున అధికారిక సెలవులు ఉన్నాయి. ఇక 27న వారానికి 5రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.