టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం 3 రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది. విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్‌శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది.