దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మొదట్లోనే సెన్సెక్స్ భారీగా కుంగిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో 79,732 వద్ద.. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 24,127 దగ్గర ట్రేడవుతున్నాయి. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 84.58గా ఉంది. ఈ వారంలో RBI ద్రవ్యపరపతి విధాన సమీక్షా నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.