TG: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. CM విదేశీ విద్య స్కీమ్ కింద మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు telanganaepass.cgg.gov.inలో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ తెలిపారు. US, UK, AUS, కెనడా, సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో PG, PHD చేస్తున్న వారు అర్హులు. ఎంపికైన వారికి రూ.20 లక్షల స్కాలర్ షిప్, విమాన టికెట్ చార్జీలు అందజేస్తారు.