ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం FDలపై కొత్త రేట్లు వర్తించనున్నాయి. సవరించిన రేట్లు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు పేర్కొంది. సాధారణ ఖాతాదారులకు 4-7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4-7.49 శాతం మధ్య వడ్డీ రేట్లు అమలు కానున్నాయి. సాధారణ ఖాతాదారులకు 7-45 రోజుల మధ్య డిపాజిట్లకు 4 శాతం వడ్డీని బ్యాంకు అమలు చేస్తోంది.