TG: రాష్ట్రంలో రెండో రోజు కాలేజీల బంద్ కొనసాగుతోంది. దాదాపు 2వేలకు పైగా ప్రైవేట్ కాలేజీలు బంద్‌లో పాల్గొన్నాయి. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ విద్యార్థి సంఘాలు కూడా ప్రైవేట్ కాలేజీల ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.