ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ IPO ఇవాళ మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్ మొదలయ్యే సమయానికి NSEలో రూ.420 వద్ద, BSEలో రూ.412 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. ఇష్యూ ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. స్విగ్గీ సబ్స్క్రిప్షన్ ఈనెల 8న ముగిసింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.6828 కోట్లు సమీకరించనుండగా.. ఇప్పటికే రూ.5,085 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయి.