కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ పథకం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటికే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. దాదాపు ఆరు లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల ద్వారా ఇంటర్న్షిప్ అవకాశం కల్పించనున్నారు. ఎంపికైన గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000 అందించనున్నారు.