భారత మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో V40e ఫోన్‌ను ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనుంది. వివో వీ40, వీ40 ప్రో ఫోన్లతో వివో వీ40ఈ ఫోన్ జత కలుస్తుంది. రెండు కలర్ల ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.