దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి గణనీయస్థాయిలో నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. నవంబర్ నెలలో రూ.1.82 లక్షల కోట్లు వసూళ్లు అయినట్లు తెలిపింది. వీటిలో సీజీఎస్టీ కింద రూ.34,141 కోట్లు, ఎస్జీఎస్టీ రూపంలో రూ.42,047 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.91,828 కోట్లు, సెస్సుల రూపంలో మరో రూ.13,256 కోట్లు సమకూరినట్లు చెప్పింది. గతేడాది ఇదే నెలలో సమకూరిన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరుగుదల నమోదైంది.