నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఐదు సహకార బ్యాంకులకు ద్రవ్య పెనాల్టీ విధించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో గుజరాత్ నుంచి 3, బీహార్ నుంచి రెండు బ్యాంకులు ఉన్నాయి. ఇందులో బీహార్‌కు చెందిన బెట్టియా నేషనల్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు అత్యధికంగా రూ.4.10 లక్షల జరిమానా విధించింది. టర్మ్ డిపాజిట్లను క్లెయిమ్ చేయడంలో, కేవైసీని అప్డేట్ చేయడంలో సదరు బ్యాంకులు నిబంధనలు పాటించలేదని సమాచారం.