JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 21, 22, 23, 24 తేదీలలో పరీక్షలు జరగనుండగా.. అడ్మిట్ కార్డులు NTA అధికారిక సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఉ.9 గంటల నుంచి మ. 12 గంటల వరకు ఒక పరీక్ష.. మ. 3 నుంచి సా.6 గంటల వరకు మరో పరీక్ష జరగనుంది. అటు 28, 29న జరిగే పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు తర్వాత విడుదల కానున్నాయి.